రెండవా ఇన్నింగ్స్ సాహసాలు


అత్యద్భుతమైన ప్రణాళికతో అమోఘమైన నైపుణ్యం కల నిష్ణాతుల మార్గదర్శకంలో ఎంతో శ్రద్ధతో మా సీనియర్ సిటిజన్లు మరోసారి తమ యవ్వనాన్ని రుచి చూసే ఉల్లాస ఉత్సాహ మరియు ఆనందకరమైన సాహస యాత్రలను ఏర్పాటు చేస్తున్నారు రాంబంటు వారు. సీనియర్ సిటిజన్లను బీచ్ లు, కొండలు, ఉద్యానవనాలు మరియు ఇన్ స్టేషన్ల వంటి వివిధ ప్రదేశాలకు తీసుకెళ్లడం అక్కడ వారు తమతో తాము పోటీ పడి వారి యవ్వనాన్ని తిరిగి ఆస్వాదించే టట్లు మరియు వారి ఆశలను ఆత్మను సంతృప్తిపరచి వారిలో నూతనోత్సాహంతో కలగలిసిన ఆత్మవిశ్వాసాన్ని నింపి కళ్ళల్లో ఆనంద జ్యోతులను వెలిగిస్తుంది రాంబంటు.

తరాల మధ్య వారధి


రాంబంటు వారు నిన్నటి మరియు నేటి తరాల మధ్య అందమైన పరస్పర చర్చలను నిర్వహిస్తారు. ఇది నిన్నటి తరం వారైనా సీనియర్ సిటిజన్ల అద్భుతమైన అనుభవాలను పంచుకునేలా చేస్తుంది మరియు నేటితరం అడిగే ప్రశ్నలకు వారి అనుభవాల లో నుండి సమాధానాలు ఇవ్వటం ద్వారా మంచి మరియు ఉజ్వల సమాజ భవిష్యత్తుకు చక్కని మార్గాన్ని నిర్దేశిస్తారు. అంతేకాకుండా వారు ఈ సమాజానికి దేశానికి ఎంతో ముఖ్యమని చాటిచెప్పే అమోఘమైన కార్యక్రమాన్ని రాంబంటు వారు అందిస్తున్నారు.

యవ్వన హృదయం - పాదాలు


వృద్ధాప్యంలో సీనియర్ సిటిజన్ల మనస్సు మరోసారి యవ్వనాన్ని సంతరించుకునేలా పెయింటింగ్, మ్యూజిక్, షార్ట్ ఫిలిం మేకింగ్, స్క్రిప్ట్ రైటింగ్ గీతాలాపన, నవీన నాట్య కళ మొదలైనటువంటి రక రకాల లలిత కళా తరగతులను మేం రాంబంటు సర్వీసెస్ ద్వారా అందిస్తున్నాం. వయస్సు అడ్డం కానీ కళలను కొత్తగా నేర్చు కోవటం ద్వారా సీనియర్ సిటిజన్ల యవ్వనాన్ని మరోసారి వారికి జ్ఞప్తికి తెచ్చి వారి జీవితాలలో నూతనోత్సాహం నింపుతూ వారిని ఉత్సాహ పరుస్తూ జీవన మాధుర్యాన్ని వారికి పంచుతున్నాం.

మార్పు కోసం స్వరం (డిబేట్)


కేవలం వినోదం కోసమే కాకుండా రాంబంటు వారు డిబేట్ లాంటి కార్యక్రమాలలో నిన్నటి మరియు నేటి తరాలను కలిపి నిన్నటి తరాల వారైన సీనియర్ సిటిజన్ల యొక్క అనుభవాలతో స్ఫూర్తిని నేటి తరంలో నింపుతూ రాబోయే తరం యొక్క దూకుడు స్వభావాన్ని మెరుగైన సమాజం, దేశం కోసం ప్రభావితం చేస్తూ వారిని వారు తెలుసుకునే స్పృహను కల్పిస్తూ సరియైన మార్గంలో నడవటానికి ప్రేరేపించే అత్యద్భుతమైన కార్యక్రమాన్ని రాంబంటు వారు అందిస్తున్నారు.

చిత్రలహరి ( అంత్యాక్షరి మరియు గీతాలాపన)


మేము మా సీనియర్ సిటిజన్ల యొక్క ఉత్సాహాన్ని మరియు శక్తిని మరింత తేజ పరిచే గీతాలాపన కార్యక్రమాలలో పాల్గొనేట్టు చేసి వారి మనసులను పారవశ్యంలో తేల చేసి తద్వారా, వారి జ్ఞాపకశక్తిని రిఫ్రెష్ చేసి మరియు వారి పోరాట మరియు పోటీ స్ఫూర్తికి ఒక వేదికను అందిస్తాము.

పకృతి మమేక యాత్రలు


రాంబంటు సర్వీసెస్ సంస్థ వారు సీనియర్ సిటిజన్లను స్థానిక ఉద్యానవనాలు, అభయారణ్యాలు మరియు అడవులలో ట్రెక్కింగ్కు తీసుకుని వెళ్లి, అక్కడ వారు తాజాగా మరియు ఒత్తిడి నుండి రిఫ్రెష్ అయ్యేటట్టు, ప్రకృతి యొక్క శాంతియుత మరియు ఆకుపచ్చ రంగు యొక్క శక్తిని వారి జీవితాలలో నింపే అద్భుతమైన కార్యక్రమాన్ని రాంబంటు వారు ఎంతో సమగ్రమైన సమర్థవంతులైన మార్గదర్శకులచే నిర్వహిస్తారు.

పాట్లక్ (అదృష్ట భోజన పాత్ర)


రాంబంటు సర్వీసెస్ వారు పాట్లక్ (అదృష్ట భోజన పాత్ర) ప్రోగ్రామ్‌లను అప్పుడప్పుడు నిర్వహిస్తూ, అక్కడ సీనియర్ సిటిజన్లు తమను నిరుత్సాహపరిచే ఆలోచనలను దూరం చేసేలా అమోఘమైన శక్తిని తమకు నచ్చిన వంటకాన్ని అందించడంలో ప్రదర్శించేలా చేసి మరియు వారి ఉత్తమ సహకార గుణం యొక్క శక్తిని, వారి ప్రతిభను విడమరిచి చెప్పే పాకశాస్త్ర నైపుణ్యాన్ని నేటి తరాల ముందు ఆవిష్కరిస్తారు రాంబంటు వారు.

ఆత్మీయ కూడికలు


సీనియర్ సిటిజన్లకు ఆధ్యాత్మిక సమావేశాలను నిర్వహించడం ద్వారా మేము ఆధ్యాత్మిక ప్రశాంతత మరియు శాంతిని పునరుద్ధరించాలని మరియు రిఫ్రెష్ చేస్తామని మరియు ఆధ్యాత్మికత గురించి వారి ఆలోచనలను పంచుకోవడానికి ఒక వేదికను అందిస్తున్నాము మరియు మన పూర్వీకులు స్థాపించిన రోజువారీ సాంప్రదాయిక ఆచారాలను, పండుగ సమయాల్లో పాటించవలసిన ఉత్తమ సాంప్రదాయాలను, మరియు ఆధ్యాత్మిక సూక్తుల యొక్క ప్రాముఖ్యతను మరియు అంతర్గత అర్ధాన్ని తెలుసుకోవడం, పంచుకోవడం మరియు లోకానికి చాటిచెప్పే అమోఘమైన అనిర్వచనీయమైన ప్రక్రియకు రాంబంటు సంస్థ శ్రీకారం చుట్టింది.

స్వచ్ఛంద కార్యక్రమాలు


“మన సమాజం కోసం మేము ఉన్నాము”- అనే ఒక సందేశాన్నినేటి యువ తరానికి పంపడానికే కాకుండా సీనియర్ సిటిజన్ల ఉత్సాహాన్ని ప్రదర్శించడానికి రాంబంటు సర్వీసెస్ సంస్థ ద్వారా కార్యక్రమాలను స్వచ్ఛందంగా సమాజం కోసం నిర్వహిస్తాం.