food-img
food-img

భోజన ఏర్పాటు సేవలు


ఆరోగ్యం అనేది సంపద అది అన్ని వయసుల వారికి ఎటువంటి సందేహం లేకుండా వర్తిస్తుంది అందుకని రాంబంటు వారు సీనియర్ సిటిజన్ల ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా, వారి కోసం హోటళ్లలో తయారు చేసినట్లు కాకుండా వారి అవసరాలకు తగ్గట్టుగా నిపుణులైనటువంటి వైద్యులు ధ్రువీకరించిన, నిర్ధారించిన, నిర్ణయించిన డైట్ ప్లాన్ ప్రకారంగా ఇంట్లో ప్రత్యేకంగా తయారు చేసినా శక్తివంతమైన ఆహారాన్ని అందిస్తారు. వైద్య సూచనల మేరకు తయారుచేయబడిన ఆహారం వలన సీనియర్ సిటిజన్ల ఆరోగ్యం మెరుగుపరచడం కోసం రాంబంటు వారు ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి తగిన సమయంలో అందిస్తారు.

ఇంటి భోజన ఏర్పాటు


ఎవరైతే సీనియర్ సిటిజన్లు ఇంట్లో వంట చేసుకునేందుకు కష్టపడే వారి కోసం రాంబంటు వారు, వారి దగ్గర నుండి అందుకున్న సూచనలు వారి ఇష్ట ప్రకారం ఇంటి వద్ద వండిన రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారమును తగు సమయమునకు అందిస్తారు

క్యాటరింగ్ సేవలు


సీనియర్ సిటిజన్ల గృహాలకు ఆహ్వానితులైనటువంటి వారి కోసం, వారికి ఆయాసకరమైన భోజనాలు సిద్ధం చేసే విషయంలో రాంబంటు వారు సమర్థులైన టువంటి అనుభవజ్ఞులైన వారిచే రుచికరమైన శుభ్రత తో కూడిన ఆరోగ్యవంతమైన ప్రత్యేక క్యాటరింగ్ సేవలను అందిస్తున్నారు. ఆర్డర్ తీసుకునే ముందే వారిచ్చే అన్ని సూచనలను మార్గదర్శకాలను పరిగణలోనికి తీసుకుని వారికి ఆహారాన్ని భోజనాన్ని వారు సూచించిన సమయానికి అనిపించడం రాంబంటు వారి విశిష్ట ప్రత్యేకత.

వంటమనిషి సేవలు


ఇప్పుడు సీనియర్ సిటిజన్లు వారు కోరుకునే వంటలను వారి పర్యవేక్షణలో రాంబంటు వారి సహకారంతో సమర్థవంతమైన అనుభవ పూర్వక వంట మనిషిని వారి కోసం వారు కోరుకున్న సమయాలలో వారి ఇంటిలో వంట చేసి పెట్టే సదావకాశం కల్పిస్తుంది.

ముఖ్యమైన ప్రముఖ కార్యక్రమాలు


వృద్ధుల కోసం సంతోషకరమైన అద్భుతమైన వాతావరణాన్ని కల్పించడమే మా ముఖ్య లక్ష్యం. ప్రతి ఒక్కరిదీ వేరు స్వభావం అని మేం అర్థంచేసుకోగలం. ఇప్పుడు మా కస్టమర్ సపోర్ట్ని సంప్రదించి మీకు కావలసిన సేవలను నిర్ణయించే బాధ్యత మీదే.