హ్యాండీ మాన్ సేవలు
రాంబంటు సర్వీసెస్ యొక్క ప్రధాన ఇతివృత్త మైనా సీనియర్ సిటిజన్ల సంక్షేమాన్ని పూర్తి శ్రద్ధతో నిర్వహిస్తాము. సీనియర్ సిటిజన్లకు యువతరం నుండి సాధారణ మరియు వృత్తి పరమైన సహాయాన్ని అందిస్తాము. చిన్న చిన్న మరమ్మతుల దగ్గర నుండి పూజ ఏర్పాటు, మార్కెట్ సహాయం మరియు తోటపని వంటి మొదలైన సులభ పనులలో వారికి సహాయపడుతూ వారిపట్ల నిబద్ధతతో కూడిన శ్రద్ధ వహిస్తాము, అవసరమైతే ఒంటరితనాన్ని పోగొట్టడానికి వారితో కూర్చుని కబుర్లు చెప్పే స్నేహితుని గా రాంబంటు సర్వీసెస్ ద్వారా ఉంటూ మా నిబద్ధతని చాటు కుంటాము.
మరమ్మతులు
ఇంటి దగ్గరికి వచ్చి మరమ్మతు చేయాల్సిన ప్రతి ఒక్క వస్తువును, ఇంటి దగ్గరే రాంబంటును సంప్రదించడం ద్వారా త్వరగా, నిజాయితీగా, సమగ్రంగా, పూర్తి సమర్థతతో మరమ్మత్తు చేయగల నిష్ణాతులైన పని మంతులకు అప్పగించి మీ కళ్ళ ముందరే మరమ్మతు చేయించుకునే సులభమైన అవకాశం. ఇంటి కట్టడ మరమ్మతుల దగ్గరనుండి ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్తో పాటు DTH మరమ్మతులను కూడా రాంబంటు ద్వారా జరిపించు కోవచ్చు.
తోటపని
విశ్రాంతి మరియు ప్రశాంతత కోసం ప్రతి సీనియర్ సిటిజన్ ఇష్టపడి పెంచుకునే తమ తోటను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండే భారమైన పనిని రాంబంటు ద్వారా పూర్తిగా తోటకు నీరు పెట్టే దగ్గరనుండి భూమిని సిద్ధపరచడం, నాట్లు వేయడం, కలుపు తీయడం వంటి తోట పనులను ఇక సులభంగా దగ్గరుండి ప్రయాస పడకుండా జరిపించు కోవచ్చు.
పూజ ఏర్పాటు
ఇంట్లో పూజ జరిపించడం సీనియర్ సిటిజన్లకు ప్రయాసతో కూడిన ఒక భారం ఎందుకంటే ఒక పూజ జరిపించడం కోసం అనుభవజ్ఞులైన పౌరహిత్యం తెలిసిన పూజారులు ఆ పూజకు కావాల్సిన వస్తువులు తేవడం అనుకున్నంత సులువు కాదు కాబట్టి రాంబంటు ను సంప్రదించి వారి తోడ్పాటుతో ఇక ఏ పూజ అయినా నిర్విఘ్నంగా జరిపించు కోవచ్చు.
మార్కెట్ సహాయం
రాంబంటు వారి సహకారంతో ఇంటికి కావాల్సిన సరుకులను మరియు కూరగాయలను ఇంకా వ్యయప్రయాసలకతీతంగా చాలా సులభంగా ఇంటికి తెప్పించుకోవచ్చు.
పుస్తక ఏర్పాటు
రాంబంటు సర్వీసెస్ వారి విలువైన రత్నం లాంటి సేవ ఏమిటంటే పుస్తక ప్రియులైన సీనియర్ సిటిజన్లకు కావాల్సిన ఏ పుస్తకాన్ని అయినా తెచ్చిపెట్టడం.
సహవాస ఏర్పాటు
ఒంటరితనం నుండి విముక్తి కోసం పరితపించే సీనియర్ సిటిజన్లకు ఆహ్లాదకరమైన, వినోదభరితమైన, ఉల్లాసవంతమైన సహవాస ప్రక్రియను కూడా రాంబంటు వారు పూర్తి నిబద్ధతతో, ప్రేమతో నిర్వర్తిస్తారు.
ముఖ్యమైన ప్రముఖ కార్యక్రమాలు
వృద్ధుల కోసం సంతోషకరమైన అద్భుతమైన వాతావరణాన్ని కల్పించడమే మా ముఖ్య లక్ష్యం. ప్రతి ఒక్కరిదీ వేరు స్వభావం అని మేం అర్థంచేసుకోగలం. ఇప్పుడు మా కస్టమర్ సపోర్ట్ని సంప్రదించి మీకు కావలసిన సేవలను నిర్ణయించే బాధ్యత మీదే.
